#చికెన్ కర్రీ
సులభమైన చికెన్ కర్రీ రెసిపీన్ని మీరు మీ ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులకు సులభంగా చికెన్ కర్రీ వంటకం చేయవచ్చు.
పదార్థాలు:
• చికెన్ ముక్కలు- 500 గ్రాములు
• ఉప్పు - 2 టీస్పూన్ల
• కారం - 1 టీస్పూన్
• చికెన్ మసాలా - 2 టీస్పూన్ల
• నూనె - 3 టీస్పూన్ల
• ధనియా పొడి - 1 టీస్పూన్
• ఉల్లిపాయలు - 2 , సన్నగా తరిగి
• పచ్చి మిరపకాయలు - 2 , సన్నగా తరిగి
• అల్లం-వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
• కొంచెం కరివేపాకు
• నీరు - 1 కప్పు నీరు
• కొత్తిమీర ఆకులు, అలంకరణ కోసం
తయారీ విధానం:
• తయారీ:
• ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి.
• ఒక పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కొద్ది పాటి మంటపై ఒక 10 నిమిషాలు ఉడికించలి.
• కారంగా తయారు చేయడం:
• మంటపై పెద్ద కడాయిని పెట్టి, అందులో నూనె వేడి చేయాలి.
• నూనె వేడయ్యాక , తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
• తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, మళ్లీ కొన్ని నిమిషాలు వేయించాలి.
• ఆ తర్వాత కారం వేసి, నీలు పోసి మసాలా బాగా ఉడికించాలి.
• చికెన్ వేసి ఉడికించడం:
• ఈ సమయంలో ఉడికించిన్న చికెన్ ముక్కలను కడాయిలో వేసి, బాగా కలపాలి.
• చికెన్ ముక్కలు రంగు మారినా తరువాత మధ్యతాపంలో 20-25 నిమిషాలు ఉడికించాలి.
• చికెన్ బాగా ఉడికి, కర్రీ చిక్కబడే టప్పుడు చికెన్ మసాలా,ధనియా పొడి వేస్తే మంచి వసన్న నాతో కూడిన చికెన్ కర్రీ తయారు అవుతుంది.
• సర్వింగ్:
• చికెన్ కర్రీను ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని, కొత్తిమీర ఆకులతో అలంకరించాలి.
• ఈ కర్రీను వేడి రోటీ, చపాతీ, లేదా అన్నం తో సర్వ్ చేయవచ్చు.
గమనిక:
• చికెన్ కర్రీ మరింత రుచిగా కావాలంటే, మీకు ఇష్టమైన మసాలా పౌడర్లను కూడా జోడించవచ్చు.
• చికెన్ కర్రీని మరింత చిక్కగా కావాలంటే, కాస్త కొబ్బరి పాలు వేసుకోవచ్చు.

Comments
Post a Comment