#పూర్ణం కుడుములు (poornam kudumulu )

 #పూర్ణం కుడుములు:

పూర్ణం కుడుములు: ఒక సాంప్రదాయమైన దక్షిణ భారతీయ వంటకం, ఇది రుచికరంగా ఉండటంతోపాటు, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఈ పూర్ణం కుడుములు వినాయకచవితి రోజున ఎక్కువగా చేస్తారు .ఎందుకంటే వినాయకునికి ఇష్టం కాబట్టి. 



కావలసిన పదార్థాలు:

బియ్యం పిండి : 2 కప్పులు 

కొబ్బరి : 2 (చిపలు తురుముకొనావి )

బెల్లం : 1 కప్పు 

నెయ్యి : 5 టీస్పూన్

జీడిపప్పు , : 10 & 20

బాదం. : 10 & 20

యాలకులు : 5 &6

నీళ్లు : 2 కప్పులు 

ఉప్పు : 1 టీస్పూన్

తయారీ విధానం :

 
- ఒక గిన్నెలో 2 కప్పు నీళ్లు తీసుకోవాలి, తరువాత ఉప్పు ఆరా టీస్పూన్ ,నెయ్యి 1 టీస్పూన్ వేసి చిన మంట పై 10 & 15 నిమిషాలు మరగించల్లి .

- మరగించిన నీళ్లలో 2 కప్పులు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి .కలుపుకూన మిశ్రమాన్ని కొద్దిసేపు మూత వేసి పక్కన పెట్టుకోవాలి. 

- ఓక మీడియం మంటమీదా ఒక కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ నెయ్యి వేసి అందులో తూరిమిన కొబ్బరి , 1 కప్పు బెల్లం వేసి వేగించాలి. తరువాత అందులోజీడిపప్పు, బాదం, యాలకులు వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వేగించాలి. తరువాత దించి పక్కనపెట్టి ఆరాని వ్వలి.

- ఇపుడు చేతికి నెయ్యి రాసుకుని ముందుగా మనం పక్కనపెట్టిన పిండి మిశ్రమాన్ని బాగా చేతితో కలపాలి .

- ఇప్పుడు పూర్ణ కుడుములు తయారు చేసుకుందం ఇపుడు బెల్లం కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి.

- ఇప్పడు పిండి మిశ్రమాన్ని అరచేతిలో నెయ్యి రాసుకొని మందంగా ఒత్తు కోవాలి .వారువాత కొబ్బరి బెల్లం ఉండలను ఇందులో పెట్టి గుండ్రంగా చేసుకోవాలి.






- తరువాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు నీల్లు పోసి మీడియం మంటపై పెట్టలి. తరువాత ఇడ్లీ ప్లేట్ కి నెయ్యి రాసి మనం తాయారుచేసుకున్న పూర్ణం కుడుముడులు పెట్టలి 20 &30 నిమిషాలు ఉడికించలి.

- తరువాత 20 నిమిషాలు అయ్యకా దించి పక్కనపెట్టి చల్లరాక ఓఒక్కోటిగా తీసి గిన్నెలో పెట్టుకోవాలి. 

సర్వింగ్ : ఇప్పుడు పూర్ణకుడుములు ఓక ప్లేట్లో తీసుకొని మీకుఇష్టమయిన దేవునికి గాని మీకు ఇష్టమైన బంధుమిత్రులకు ఇష్టంగా పెట్టుకోవచ్చు.


గమనిక :

పూర్ణంకుడుములను వేడి గా ఉన్నప్పుడు తెస్తే విరిగిపోయే అవకాశలు ఉన్నాయి. అందుకే చల్లారిన తరువాత తీసుకోవాలి.

కొబ్బరి బెల్లం మిశ్రమంలో కావలసి ఉంటే ఇంకాఎక్కువగా డ్రెయిఫ్రంట్ వేసుకోవచ్చు.

Comments